| |
El período embrionario (Las primeras 8 semanas)
Desarrollo embrionario: Las primeras 4 semanas
Capítulo 3 Fecundación
|
| |
| జీవ శాస్త్ర ప్రకారం చెప్పాలంటే
"మానవ వికాసం ఫలదీకరణం నుండి ప్రారంభమవుతుంది" .
అంటే ఎప్పుడైతే ఒక స్త్రీ మరియు పురుషుడు
తమ సంతానోత్పత్తి కణాల సంగమం ద్వారా చెరి 23
స్వంత క్రోమోజోములను కలిసేలా చేస్తారో అప్పటినుండి.
సాధారణంగా స్త్రీ పునరుత్పత్తి కణాన్ని "అండము" అంటారు.
అయితే దీనికి సరియైన పదము ఊకైట్.
అదే విధంగా, పురుషుని పునరుత్పత్తి కణాన్ని ఎక్కువగా
"స్పెర్మ్" అంటారు.
కాని దీనికి అనువైన పదం స్పెర్మటోజూన్.
ఓవులేషన్ అనే ప్రక్రియ ద్వారా స్త్రీ ఓవరీ నుండి ఊకైట్
విడుదలైన తరువాత
ఊకైట్ మరియు స్పెర్మటోజూన్
యుటెరైన్ ట్యూబులలో ఒక దానిలో కలుస్తాయి.
ఈ ట్యూబులను తరచు పాల్లోపియన్ ట్యూబులు అంటారు.
ఈ యుటెరైన్ ట్యూబులు స్త్రీ ఓవరీలను
ఆమె యుటెరస్ లేదా గర్భముతో కలుపుతాయి.
ఈ విధంగా ఏర్పడిన ఏక కణం - ఫలదీకరించబడిన
అండాన్ని జైగోట్ అంటారు.
అంటే "కట్టిన లేదా పరస్పరం కలిపిన" అని అర్ధము.
|
Capítulo 4 ADN, división celular y factor temprano de embarazo
|
| |
| ఈ జైగోట్ లోని 46 క్రోమోజోములు
ఒక నూతన మానవుని సంపూర్ణ జన్యురేఖాచిత్రపు
విలక్షణ ప్రధమ అధ్యాయానికి ప్రతినిధిత్వం వహిస్తాయి.
ఈ గొప్ప ప్రణాళిక
బలంగా అల్లుకోబడిన డిఎన్ ఏ అనే
అణువుల మధ్య ఉంటుంది.
అవి సంపూర్ణ శరీర వికాసానికి అవసరమైన
నిర్ధేశకాలను కలిగి ఉంటాయి.
మెలివేసిన నిచ్చెనలాగా కనిపించే ఈ డిఎన్ ఏ మాలిక్యూల్స్
డబుల్ హెలిక్స్ గా పిలవబడతాయి.
ఈ నిచ్చెనలోని మెట్లు
గనైన్, సిస్టోసైన్, అడెనైన్ మరియు తైమైన్
అణువులు లేదా మూలాల జతలతో ఏర్పడి ఉంటాయి.
|
| గనైన్ కేవలం సిస్టోసైన్ తోనే జత కలుస్తుంది.
మరియు అడెనైన్ కేవలం తైమైన్ తోనే జత కలుస్తుంది.
ప్రతి మానవ కణంలో సుమారు 3 బిలియన్లు
ఈ మూల జతలు ఉంటాయి.
ఒక కణంలోని డిఎన్ ఏ ఎంతో సమాచారం కలిగి ఉంటుంది.
ఒకవేళ దానిని ముద్రించిన పదాలలో చూస్తే
కేవలం ఒక్కో మూలం మొదటి అక్షరాన్ని రాయాలన్నా
1.5 మిలియన్ల పేజీల పుస్తకం అవసరమవుతుంది!
రెండు చివరలకు పరచి చూస్తే
ఒక మానవ కణంలోని డిఎన్ ఏ 3 1/3 అడుగులు లేదా
1 మీటరు పొడవు ఉంటుంది.
|
| మనము ఒక వయోజన మానవుని 100 ట్రిలియన్ కణాలలోని
డిఎన్ ఏ ని విడదీయ గలిగితే
అది 63 బిలియన్ మైళ్ళ దూరం విస్తరిస్తుంది
ఈ దూరం భూమి నుండి సూర్యునికి తిరిగి భూమికి
340 సార్లు చేరేటంత ఉంటుంది.
|
| ఫలదీకరణము తరువాత సుమారు 24 నుండి 30 గంటలలో
జైగోట్ తన మొదటి కణ విభజన పూర్తి చేసుకుంటుంది.
సూత్రీయ విభాజన ప్రక్రియ ద్వారా
ఒక కణం రెండు, రెండు నాలుగు ఆ విధంగా కణ విభజన జరుగుతుంది.
|
| ఎంతో తొలి దశలో అంటే ఫలదీకరణ ప్రారంభమైన 24 నుండి 48 గంటల తరువాత
గర్భవతి అయిన విషయాన్ని.
తల్లి గర్భంలో ఉండే "తల్లి గర్భధారణ కారణాంశము" అని
పిలువబడే హార్మోనును గుర్తించడం ద్వారా నిర్ధారించవచ్చు.
|
Capítulo 5 Etapas iniciales (mórula y blastocito) y células madre
|
| |
| ఫలదీకరణం తరువాత 3 నుండి 4 రోజులలో
విభజన చెందుతున్న కణాలు గుండ్రని ఆకారాన్ని
సంతరించుకుం టాయి,.
ఈ దశలో పిండాన్ని మోరులా అని పిలుస్తారు.
కణాలతో నిండిన ఈ బంతి లాంటి ఆకారంలో 4 నుండి 5
రోజులకు ఒక రంధ్రము ఏర్పడుతుంది.
అప్పుడు పిండాన్ని బ్లాస్టోసిస్ట్ అంటారు..
ఈ బ్లాస్టోసిస్ట్ లోపలి కణాలను
లోపలి కణ రాశి అంటారు.
దీని నుండి అభివృద్ధి చెందుతున్న మానవునికి ఎంతో
అవసరమైన తల, శరీరం మరియు ఇతర నిర్మాణాలు పుట్టుకొస్తాయి.
లోపలి కణ రాశిలోని కణాలను
ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్ అని అంటారు.
ఎందుకంటే వాటికి మానవ శరీరంలోని 200 కంటే ఎక్కువ
రకాల వేరువేరు కణాలుగా మారే సామర్ధ్యం ఉంది.
|
Capítulo 6 1 a 1½ semanas: implantación y gonadotropina coriónica humana (GCH)
|
| గర్భాశయ నాళము దిగువకు ప్రయాణించి తరువాత
తొలి దశ పిండము తల్లి గర్భాశయము యొక్క
లోపలి గోడపై స్థిర పడుతుంది.
పిండ స్థాపన అని పిలువబడే ఈ ప్రక్రియ ఫలధీకరణ
తరువాత 6రోజులకు ప్రారంభమై10 నుండి 12రోజులకు
పూర్తిఅవుతుంది.
పెరుగుతున్న పిండములోని కణాలు
హ్యూమన్ కొరియోనిక్ గొనాడో ట్రోపిన్
లేదా హెచ్ సి జి అనే హార్మోనును ఉత్పత్తి చేయడం
ప్రారంభిస్తాయి.
అత్యధిక గర్భధారణ పరీక్షలలో ఇదే పదార్ధాన్ని గుర్తించడం
జరుగుతుంది.
హెచ్ సి జి మాతృత్వ సంబంధమైన హార్మోలను
సాధారణ ఋతుక్రమం ఆగిపోయేలా నిర్ధేశించి
గర్భం కొనసాగేందుకు దోహద పడుతుంది.
|
Capítulo 7 La placenta y el cordón umbilical
|
| గర్భాశయంలో పిండ స్థాపన తరువాత
బ్లాస్టోసిస్ట్ ఉపరితలంపై ఉన్న కణాలు
ప్లాసెంటా అనే భాగములో కొంత భాగము ఏర్పడడానికి తోడ్పడతాయి,
ఈ భాగము తల్లి మరియు పిండము యొక్క
ప్రసరణ వ్యవస్థల మధ్య అనుసంధానంగా పని చేస్తుంది.
ఈ ప్లాసెంటా మాతృ వ్యవస్థ నుండి ప్రాణ వాయువు,
పోషక పధార్ధాలు,
హార్మోనులు మరియు ఔషధాలు, రూపుదిద్దుకుంటున్న
మానవ శిశువుకు అందించడం మరియు;
వ్యర్ధ పదార్ధాలను తొలగించడంతో పాటు;
తల్లి రక్తం, గర్భస్థ పిండం రక్తంతో
కలవకుండా ఆపుతుంది.
ఈ ప్లాసెంటా హార్మోనులను కూడా ఉత్పత్తి చేస్తుంది
మరియు పిండం మరియు పిండ శరీర ఉష్ణోగ్రతను నియమబద్దం చేస్తూ.
తల్లి శరీర ఉష్ణోగ్రత కంటే కొంచెం ఎక్కువగా ఉండేలా చేస్తుంది.
ప్లాసెంటా వికాసం చెందుతున్న మానవ శిశువులో
బొడ్డు పేగు యొక్క నాళాల ద్వారా సంబంధం
కొనసాగిస్తూ ఉంటుంది.
ఈ ప్లాసెంటా ప్రాణరక్షక సహాయ సామర్ధ్యాలు
ఆధునిక వైద్యశాలల లోని ఇన్సెంటివ్ కేర్ యూనిట్లతో
పోటీ పడుతుంటాయి.
|
Capítulo 8 Nutrición y protección
|
| |
| ఒక వారానికి,
అంతరరాశిలోని కణాలు
రెండు పొరలుగా రూపొందుతాయి
ఇవి హైపోబ్లాస్ట్
మరియు ఎపిబ్లాస్ట్ అని పిలువబడతాయి.
హైపోబ్లాస్ట్ నుండి
యోక్ శాక్ నిర్మాణం జరుగుతుంది,
ఈ యోక్ శాక్ తొలిదశ పిండానికి
తల్లి పోషక పదార్ధాలు అందించేందుకు
అవసరమైన నిర్మాణాలలో ఒకటి.
ఎపిబ్లాస్ట్ లోని కణాల నుండి
అమ్నియన్ అనే ఒక పొర ఏర్పడుతుంది,
ఈ పొరలోనే పిండము మరియు
ఆ తరువాత గర్భస్థ శిశువు
జననం వరకు పెరుగుతాయి..
|
Capítulo 9 2 a 4 semanas: capas germinales y formación de órganos
|
| |
| సుమారు 2 1/2 వారాలకు
ఎపిబ్లాస్ట్ నుండి
3 ప్రత్యేక కణాలు
లేదా జెర్మ్ పొరలు రూపొందుతాయి.
వాటిని ఎక్టోడెర్మ్
ఎండోడెర్మ్
మరియు మెసోడెర్మ్ అని పిలుస్తారు.
ఎక్టోడెర్మ్
అనేక నిర్మాణాల పెరుగుదలకు వీలు కల్పిస్తుంది.
ఈ నిర్మాణాలలో మెదడు
వెన్నెముక,
నాడులు,
చర్మము,
గోళ్లు,
వెంట్రుకలు మొదలైనవి ఉన్నాయి.
ఎండోడెర్మ్ శ్వాసకోస వ్యవస్థకు మరియు
జీర్ణకోశ మార్గానికి ఒక లైనింగ్ ఉత్పత్తి చేస్తుంది
మరియు కొంత భాగము పెద్ద అవయవాలు
అంటే కాలేయం
ప్లీహము మొదలయిన వాటిని ఉత్పత్తి చేస్తుంది.
మెసోడెర్మ్ గుండె
కిడ్నీలు
ఎముకలు
కార్టిలేజ్
కండరాలు
రక్త కణాలు
మరియు ఇతర నిర్మాణాలను రూపొందిస్తుంది.
|
| 3 వారాలకు
మెదడు 3 ప్రాధమిక విభాగాలుగా
అంటే ముందుభాగపు మెదడు
మధ్యభాగపు మెదడు
మరియు వెనుకభాగపు మెదడుగా
విభజన చెందుతూ ఉంటుంది.
ఇదే కాలంలో శ్వాస మరియు
జీర్ణ వ్యవస్థల అభివృద్ధి
కొనసాగుతుంటుంది.
|
| మొదటి రక్త కణాలు
యోక్ శాక్ లో కనిపించడంతో
రక్తనాళాలు ఎంబ్రియో
అంతటా రూపొందుతాయి,
మరియు నాళాకారపు గుండె ప్రకటితమవుతుంది.
దాదాపు వెనువెంటనే
వేగంగా పెరుగుతున్న గుండెలో
ప్రత్యేక గదులు
అభివృద్ధి చెందడం ప్రారంభం అవడంతో
అది తనలోపలికి తానే ముడుచుకుంటుంది.
గుండె కొట్టుకోవడం
ఫలధీకరణ జరిగి 3 వారాల ఒక్క రోజుకు
ప్రారంభమవుతుంది.
శరీర వ్యవస్థలో లేదా సంబంధిత అవయవాలలో
పనిచేసే స్థాయిని సాధించే మొట్ట మొదటి వ్యవస్థ
రక్తప్రసరణ వ్యవస్థే.
|
Capítulo 10 3 a 4 semanas: el plegamiento del embrión
|
| |
| 3 మరియు 4 వారాల మధ్య,
శరీర రూపురేఖల ప్రణాళిక బహిర్గతమై,
మెదడు
వెన్నెముక
మరియు గర్భస్థ పిండము యొక్క గుండె
యోక్ శాక్ ప్రక్కనే
సులభంగా గుర్తించ గలిగేలా తయారవుతాయి.
వేగవంతమయిన పెరుగుదల
రమారమి బల్లపరుపుగా ఉన్న పిండాన్ని
ముడుచుకునేలా చేస్తుంది.
ఈ ప్రక్రియ
యోక్ శాక్ లోని కొంత భాగాన్ని
జీర్ణ వ్యవస్థ
లోపలి పొరగా చేర్చుతుంది
మరియు పెరుగుతున్న మానవుని ఛాతీ,
ఉదర భాగాల కోసం
ఖాళీ స్ధానాలను ఏర్పడేలా చేస్తుంది.
|