Skip Navigation

National Geographic Society Este programa se distribuye en los Estados Unidos y Canadá por National Geographic y EHD. [obtenga más información]

DVD ilustrado plurilingüe

La biología del desarrollo prenatal




గర్భస్థ శిశువికాస జీవ విజ్ఞానము

.తెల [Telugu]


 

Descargar versión en formato PDF  ¿Qué es PDF?
 

Capítulo 40   3 a 4 meses (12 a 16 semanas): papilas gustativas, movimientos mandibulares, reflejo perioral, primeros movimientos

11 మరియు 12 వారాల మధ్య పిండం బరువు దగ్గర దగ్గర 60% పెరుగుతుంది.

12 వారాలకు గర్భ దశలోని మూడువంతులలో మొదటి వంతు లేదా ట్రైమెస్టర్ పూర్తి అవుతుంది.

వేరువేరు స్వాద గ్రంధులు ఇప్పుడు నోటిలోపలి భాగాన్ని ఆవరిస్తాయి.
జననం నాటికి, స్వాద గ్రంధులు కేవలం నాలుక మరియు నోటి పై భాగంలో ఉంటాయి.

మల విసర్జన ఎంతో ముందుగా 12 వారాలకే ప్రారంభం అయి సుమారు 6 వారాలు కొనసాగుతుంది.

గర్భస్థ పిండం మరియు కొత్తగా ఏర్పడిన పెద్ద పేగులు తొలుత విసర్జించిన పదార్ధాలను మెకోనియమ్ అని పిలుస్తారు. ఇది జీర్ణ ఎంజైములు, మాంసకృత్తులు మరియు జీర్ణవాహిక వదిలిన మృత కణాలతో కూడి ఉంటుంది.

12 వారాలకు శరీర ఊర్ధ్వ భాగం పొడవు మొత్తం శరీర పొడవు అనుపాతంతో పోల్చితే ఆఖరి దశకు చేరుకుంటుంది. శరీర క్రింది భాగం పొడవు శరీర అనుపాతంలో పూర్తిస్థాయికి చేరుకోవడానికి ఎక్కువ కాలం తీసుకుంటుంది.

శరీరవెనుక మరియు తలపై భాగాలు తప్ప గర్భస్థ శిశువు యొక్క మొత్తం శరీరం ఇప్పుడు స్వల్ప స్పర్శకు ప్రతిస్పందిస్తుంది.

లింగ ఆధారిత అభివృద్ధి భేదాలు మొదటి సారిగా కనిపిస్తాయి. ఉదాహరణకు ఆడ గర్భస్థ శిశువు దవడల కదలికలను మగ శిశువు కంటే ఎక్కువగా ప్రదర్శిస్తుంది.

ఇంతకు ముందు చూసినట్లు నోటి దగ్గర ప్రేరణ జరిగితే వెనుక్కు ముడుచుకునే ప్రతిస్పందనకు భిన్నంగా ప్రేరేపించిన వస్తువు వైపు మళ్ళడం మరియు నోరు తెరవడం ద్వారా ప్రతిస్పందనలుంటాయి.. ఈ ప్రతిస్పందనను "రూటింగ్ రెస్పాన్స్" అంటారు. ఇది జననం తరువాత కూడా కొనసాగుతుంది, నవజాత శిశువు పాలు త్రాగే సమయంలో తల్లి చనుమొనలను వెతుక్కోవడానికి ఉపయోగపడుతుంది.

ముఖాకృతి బుగ్గల భాగంలో కొవ్వు చేరడం ప్రారంభం అవడంతో పరిణితి చెందుతుంటుంది. మరియు దంతాల అభివృద్ధి ప్రారంభమవుతుంది.

15 వారాలకు, రక్తాన్ని ఉత్పత్తిచేసే మూలకణాలు బయలుదేరి ఎముకలలోని మజ్జలో వృద్ది చెందుతాయి. అత్యధిక రక్త కణాల నిర్మాణం ఇక్కడే జరుగుతుంది.

పిండ కదలికలు 6 వారాలకే ప్రారంభమయినప్పటికీ గర్భంతో ఉన్న స్త్రీ పిండ కదలికలను 14 మరియు 18 వారాల మధ్య గమనించ గలుగుతుంది. సాంప్రదాయకంగా ఈ సంఘటన క్వికెనింగ్ అని పిలువబడుతుంది.