| |
Capítulo 1 Introducción
|
| |
| ఏ గతిశీల ప్రక్రియతో ఏక కణ నిర్మితమైన
మానవ జైగోట్
నూరు వేల లక్షల కణాలతో కూడిన
వయోజన వ్యక్తిగా మారుతుందో బహుశా అది
ప్రకృతిలో కెల్లా అత్యంత గొప్ప అద్భుతం కావచ్చు.
|
| ఈనాడు పరిశోధకులకు తెలిసిన విషయం ఏమంటే
ఎదిగిన మానవ శరీరం
నిర్వహించే అనేక సాధారణ కార్యాలు
గర్భములో ఉన్నప్పుడే నిర్ధారించబడతాయి -
తరచుగా పుట్టుటకు ఎంతో ముందుగానే.
|
| జననానికి ముందు శిశువు పెరుగుదల దశను
మనిషి జన్మించిన తరువాత జీవించడానికి
అవసరమమైన ఎన్నో శరీర ఆకృతులు మరియు
అలవాట్లు మరెన్నో నైపుణ్యాలు
సముపార్జించేందుకు సిద్దంచేసే దశగా ఈ రోజు
మరింతగా విశదమైంది.
|
Capítulo 2 Terminología
|
| మానవులలో సాధారణంగా గర్భస్థ కాలం
సుమారు 38 వారాలుగా
ఫలదీకరణం సమయం నుండి గాని,
గర్భం ధరించినప్పటి నుండి గాని,
పుట్టుక వరకు లెక్కించబడుతుంది.
|
| ఫలదీకరణ నుండి మొదటి 8 వారాలు,
ఎదుగుతున్న శిశువును పిండము అంటారు,
అనగా "తనలో తాను పెరుగుట".
పిండదశ అని పిలువబడే ఈ కాలం
ప్రత్యేకత ఏమనగా శరీరంలోని పెద్ద వ్యవస్థలు
చాలా వరకు ఇక్కడే రూపుదిద్దుకుంటాయి.
|
| 8వారాల నుండి గర్భస్థదశ చివరి వరకు
"అభివృద్ధి చెందుతున్న మానవున్ని పిండము అంటారు",
అంటే "ఇంకా జన్మించని సంతానం".
పిండదశ అని పిలువబడే ఈ కాలంలో శరీరం మరింత పెద్దగా
పెరుగుతుంది మరియు దాని వ్యవస్థలు పనిచేయడం
ప్రారంభిస్తాయి.
|
| ఈ ప్రోగ్రాములో వివరించిన అన్ని తొలిపిండ
మరియు పిండ వయస్సులు
ఫలదీకరణం సమయంనుండి
లెక్కించిన కాలాన్ని సూచిస్తాయి.
|